6. 'వ్యర్థత', హల్లుకు —
పారిజాతాపహరణము (1-125) —
ఉ. |
ఈ నయగారపుం బ్రియము లీ పను లీ మొగమెప్పు మాట లే
లా నిను నమ్మియుండిన ఫలంబిది తోడనె కల్గె నాకు నీ
యాన జుమీ ననుం జెనకి యాఱడి బెట్టుకు నవ్వువారలం
గాన నెఱుంగునే పసులకాపరి భావజ మర్మకర్మముల్.
| 334
|
'ఏలా' అని వ్యర్థ(త్వ)ము. 335
మనుచరిత్రము (2–64) —
శా. |
ఈ పాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే కామశా
స్త్రోపాధ్యాయివినా వచించెదవు మే లోహో త్రయీధర్మము
ల్పాపంబుల్ రతిపుణ్యమంచు నిక నేలా తర్కముల్ మోక్షల
క్ష్మీ పద్యాగమ సూత్రపఙ్క్తి కివెపో మీ సంప్రదాయార్థముల్.
| 336
|
అచ్చుకు —
అందే (3-84) —
శా. |
రా వైరాగ్యము పూని నీవు దగ నిర్దాక్షిణ్యచిత్తంబునన్
రావైతే జనిగాని యందులకు హోరాహోరిగాఁ బోరి యే
లా వాలాయము సేయఁగా బ్రతుకు మీ వాచారవంతుండవై
చావో యెక్కుడు నీ యెడంబొడము నెచ్చం భూసురగ్రామణీ.
| 337
|
శ్రీనాథుని నైషధము (5-28) —
ఉ. |
భావజు కేలివైభవము పట్టున నీచికురాగు మోవి యా
శీ విషనాయకుం డెవఁడు సేవ యొనర్చుట నర్థకారిగా
దో వనజాక్షి, యయ్యమృతమున్నది నీయధరంబు నందు నే
లా వెఱువన్ సుధారసమునందు విషంబు పరిస్ఫురించునే.
| 338
|