4. 'నింద’ - హల్లుకు —
కవిధూర్జటిగారి శ్రీకాళహస్తీశ్వరశతకము —
శా. |
రాజై దుష్కృతిఁ జెంది చందురుఁడు రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డా మాటనే
యాజింగూలె సమస్తబంధువులతో నా రాజశబ్దంబు సీ
నీ జన్మాంతరమందు నొప్పదు సుమీ శ్రీకాళహస్తీశ్వరా!
| 313
|
అందే —
శా. |
వేధం దిట్టఁగరాదుగాని భువిలో విద్వాంసులం జేయనే
లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులా మాపాటునే పోక క్షు
ద్బాధాదుల్ గలిగించనేల యవికృత్యంబైన దుర్మార్గులన్
సీ ధాత్రీశులఁ జేయనేటి కకటా శ్రీకాళహస్తీశ్వరా!
| 314
|
రెండవ చరణమందు 'వ్యర్థత'నే కాకువు. 315
జగ్గకవి సుభద్రాపరిణయము —
ఉ. |
అక్కట నేనుగోరిన శుభాంగుఁడు నన్ను వరించు వేడుకన్
మక్కువ పిక్కటిల్ల యతి మాడ్కిని డగ్గరివచ్చి వేడినన్
జిక్కని గుబ్బచన్ను లెడఁజేర్చి కవుంగిట బిగ్గఁజేర్చకేఁ
జిక్కులు బెట్టి వచ్చితి నిసీ యతఁ డెంత విరాలిఁదూలెనో.
| 316
|
'సీ' యనుచోట నింద. 317
అచ్చుకు —
తిమ్మకవి అచ్చతెనుఁగు రామాయణము (అయో. 86) —
గీ. |
ఆలి మాటకొరకు బేలయై కోడలిఁ
కొడుకుఁ బోవద్రోచుకొనియె నితని
దేటి మగతనం బిసీ కడు కొదువేని
ఱట్టువొందె నింక ఱంతు లేల.
| 318
|