పుట:Sukavi-Manoranjanamu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'సవతా' అనగా, (సవతు) సమానము గాదనుట.308
అచ్చుకు
అందే (అవ. 54)
ఉ.

ఆనతి యిచ్చెనా యది శిలాక్షర మెవ్వరినైన మెచ్చెనా
గృతార్థుఁజేయుఁ బగవాఁడయినన్ శరణంబుఁ జొచ్చెనా
యా నరు నేరమెంచక తనంతటివాని నొనర్చు, నిచ్చెనా
యేనుఁగు పాడి యీడుగలరే రఘునాథ నృపాల శౌరికిన్.

309
'ఈడుగలరే' అనుచోట. 310
చేమకూరవారి సారంగధరచరిత్రము (3-100)[1]
సీ.

చంద్రోదయంబైన చందాన నీరాక
             కన్నులు చల్లఁగాఁ గాంతు నెపుడు
నిను గొండఁగాఁ జూచుకొని యేవిచారంబు
             లేక నుండుదు నాత్మ లేశమైన
నిసుమంత దవ్వైన నీవు రాకుండిన
             నిదియేమొ రాఁడని యెదురుచూతుఁ
తెలియఁజూచినయెడ దృష్టిదాకునొ యని
             వేడ్కదప్పక చూడ వెఱతు నిన్ను
నెటులఁ దరియింతు నీరూప మెటులఁ గాంతు
నీ విఁకను వత్తువని యెదురెదురు జూతు
మనసులో నిన్ను నేలాగు మఱువవచ్చు
నీవు లేనిది యొక బ్రతుకే కుమార!

311
‘బ్రతుకే'- బ్రతుకు కాదనుట ఇటువలెనే తెలుసుకునేది. 312
  1. ఇక్కడినుండి ఈ ఆశ్వాసాంతము వరకున్న భాగము 'ఇ. ప్రతి'లోనిది. చూ సమాలోకనము - మూలప్రతి.