ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అను నీ పద్యమును రంగరాట్ఛందమునందు నాదేశయతికి లక్ష్యము వ్రాసినారు. యుక్తము. (అయితే) అప్పకవిగారు నిత్యసమాసయతికి లక్ష్యము(గా) వ్రాసినారు. ఇంతమాత్రమేకాదు, 169
క. | లోకంబున కర్ణాటవ | 170 |
అని నిత్యసమాసములందు వ్రాసినారు. (వీనిలో) ద్వీపాంతరీపపదములు రెండు నాదేశయతులు. నాస్తి, నాకపదములు రెండు నసమాసయతులు. అనేకపదము నఞ్ సమాసయతి. ఇవి పూర్వకవి లాక్షణికులచేత స్పష్టముగా నేర్పరించబడినవిన్ని, అలాగు భేదములున్ను స్పష్టముగా నున్నవిన్ని నిత్యసమాసములందు కలుపుటయు; ఎవరును భేదము చెప్పనివిన్ని, భేదము లేనివిన్ని అకారయతులని, ఇకారయతులని చెప్పుటయు వారి పాండిత్య మేమిటో గోచరింపదు. 171
17, 18. నసమాస, నఞ్ సమాస యతులు
లక్షణము —
ఉత్తమగండచ్ఛందము —
క. | నసమాస నఞ్ సమాసము | 172 |
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-234) —
గీ. | సరవి నసమాస నఞ్ సమాసములు కృతుల | 173 |