పుట:Sukavi-Manoranjanamu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్ష్మాపతి శ్రీకరసత్యా
లాపవిలాసమునఁ బ్రజల లాలనసేయున్.

159
ఈ రెండు పద్యములందు నుభయ లక్ష్యములున్నవి. హల్లుకు సులభము.160
అచ్చుకు
నాచన సోమన హరివిలాసము[1]
గీ.

అగ్రజన్మ నాతో మృషాలాప మిప్పు
డాడినందుకు ఫలము జిహ్వాంచలంబు
కత్తిరించెద నీ సూరకత్తిచేత
ననుచు దగ్గరి చేరిన నసురఁ జూచి.

161
పింగళి సూరన్న గిరిజాకల్యాణము
క.

కోపాటోపమ్మున ధర
ణీపాలకచంద్రముఁడు మునిశిఖామణులన్
ద్రోపించిన వారి దురా
లాపము లాడుచును బోయి రాసమయమునన్.

162
శ్రీకృష్ణరాయల ఆముక్త మాల్యద (7-31)
ఉ.

గోపురకందరాలికడకున్ శశిపుష్కరిణీకణార్ద్రసం
తాపహరానిలంబులు పతాకరణన్మణికింకిణీకలా
లాపములన్ సుఖంబడుగ నాఱిటిఁ జొచ్చి యకాండగాహనా
చాపలకృన్మరుద్గణముఁ జండుఁ డదల్చెడు లోనివాకిటన్.

163

16. ఆదేశయతి

లక్షణము
గీ.

ద్వీప ప్రేప సమీప ప్రతీపముల న
నూప పద మంతరీప పరేపములును
విశ్రమంబుల నుభయంబు వెలయుఁ గృతుల
కవివినుతి పాత్ర కజనేత్ర కంకపత్ర.

164
  1. రంగరాట్ఛందమున నిది 'హరివంశము' లోనిదిగా ఉదాహృతము. రంగ. ఛంద. 3-237