పుట:Sukavi-Manoranjanamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
హల్లుకు
ద్రోణపర్వము (1-17)
ఉ.

అంగద నాథు మ్రింగిన వృకావలి దన్వెసఁ జుట్టుకున్న స
ర్వాంగములుం జలింప బెగడందుచు దిక్కులు సూచుచున్న సా
రంగియ పోలె నుండెఁ గురురాజ భవత్సుతుసేన భీష్ము నా
జిం గబలించి పాండవులు జృంభితవిక్రమలీలఁ బొల్చుటన్.

150
ఇటువలెనె మిగిలినవి చూచుకునేది. 151
రంగరాట్భందంబునందు స్వాంత, వేదండ, మార్తండ శబ్దములు శకంధ్వాది యతులందు వ్రాసినారు. స్వాంత' నిత్యసమాసముగాని, శకంధ్వాదులలోనిది కాదు. కొందఱు లాక్షణికులు 'వేదండ' పదము నిత్యసమాసములందు వ్రాసినారు.[1] ఏమి పరిశీలించి వ్రాసినారో తెలియదు. 152

14. యుష్మదస్మచ్ఛబ్దయతి

లక్షణము
కాకునూరి అప్పకవి ఆంధ్రశబ్దచింతామణి (3-122) యందు
క.

క్షితి నస్మద్యుష్మత్పద
యతులనఁ గావ్యముల యుష్మదస్మచ్ఛబ్ద
ద్వితీయమునకుఁ బైఁబ్రాణము
లతికిన నుభయంబుఁ జెల్లు నభయవిహారా!

153
(అని వ్రాసి లక్ష్యములు)
సాంబోపాఖ్యానమునందు
క.

చతురానన నందన ది
వ్యతపోధనవర్య యుష్మదాగమనమునన్
గృతకృత్యుఁడ నైతిని నే
నతి పావనమయ్యే నస్మదన్వయ మెల్లన్.

154
  1. ‘వేదండ' శబ్దమును నిత్యసమాసయతులలో ప్రదర్శించినవాడు కూచిమంచి తిమ్మన (లక్షణసారసంగ్రహము 2.263,64)