శేషధర్మములు —
క. |
మెట్టఁడు నారకమార్గం
బెట్టి మహాక్రూరకర్ముఁ డేనియుఁ దుది ని
ట్టట్టనక నెమ్మనంబున
నెట్టన హరిఁ దలఁప గలిగెనేని మహాత్మా.
| 93
|
మొదటి 'ఏని'కి అవ్యర్థము. 94
అచ్చుకు —
ఆదిపర్వము (6-48) —
గీ. |
రాజవరుఁడైన పార్థుతో రాజుగాని
యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని
నెల్లవారలు జూడఁగ నీక్షణంబ
రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి.
| 95
|
అందే (7–142) —
మత్త. |
(మానితంబగు నాతపోమహిమం ద్రిలోకపరాభవం
బేను జేయఁగఁ బూని చేసితి నిట్టి దొక్కప్రతిజ్ఞ మున్)
దీని నెట్టులఁ గ్రమ్మఱింతు మదీయభాషిత మెన్నడు
స్నేని మోఘముగాదు దిగ్ధరణీరవీందు లెఱుంగగాన్.
| 96
|
శ్రీనాథుని కాశీఖండము (4-249) —
గీ. |
ఎట్టి యపరాధ మొనరించెనేని తల్లి
కొడుకు శపియింప దిబ్భంగిఁ గ్రూరబుద్ధి
(నతివ సత్యంబు చెప్పు మెవ్వతెవు వీవు
నావుడును శాపభీతి నన్నలిననేత్ర).
| 97
|
భాస్కరుని రామాయణము (అయో-887) —
శా. |
వానప్రస్థునిఁ జంపి యొక్కవడితో స్వర్నాథుఁడుం ద్రుంగు ధా
త్రీనాథుండన నెంతవాఁడఁట విచారింపంగ నీ కెంత నే
ర్పేనింబోవు శిరంబు వ్రక్కలయి దప్పెం దప్పె నీ కృత్య మ
జ్ఞానంబుం గడు నోడిచెప్పితివి పశ్చాత్తాపతప్తుండవై.
| 98
|