చమత్కారరామాయణము —
క. |
నిన్నుఁ జెఱఁగొన్న హైహయు
కన్నను దోర్వీర్యమెక్కుఁడగు భార్గవు లీ
ల న్నిర్జించిన రాముని
కన్నను శూరుండు ముజ్జగంబులఁ గలఁడే.
| 89
|
(హల్లుకు) —
ఆదిపర్వము (4-224) —
చ. |
వితతమఖప్రయోగవిధివిత్తము లుత్తమధీయుతుల్ జగ
న్నుతసుమహాతపోధను లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ
క్రతువున ఋత్విజుల్ కమలగర్భసమానులు పూర్వదిక్పతి
క్రతువున యాజకోత్తములకన్నఁ బ్రసిద్ధులు సర్వవిద్యలన్.
| 90
|
అరణ్యపర్వము (7-488) —
చ. |
విను మగుడంగ నాఁడు పృథివీపతిఁజూచి ధరిత్రికంటె వే
గన యగుదాని నాకసముకంటెఁ గడుం బొడవైనదాని గా
డ్పునకును నెక్కుడై జపము పొంపిరివోయెడుదానిఁ బూరికం
టెను దఱచైనదానిని ఘటింపఁగఁ జెప్పుము నాకు నావుడున్.
| 91
|
11. నిత్యయతి
లక్షణము —
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-126) —
క. |
విదితముగ నేని యనియెడు
పద మన్యపదంబుతోడఁ బద్యంబులలో
నదుకునెడ నిరుదెఱంగులఁ
బొడవున్ నిత్యయతి యనంగ భుజగవిభూషా!
| 92
|
లక్ష్యములు —
ఉభయముకు —