పుట:Sukavi-Manoranjanamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సూ.

అహ్నో౽దంతాత్. పరాగత మహః పరాహ్నః

అని కౌముది యందున్నది. [1][పరాహ్న పదమొకటి. (కాగా) పరాగతాః ఆపః అస్మాత్ పరాపః = శుష్కహ్రదము. ఈ రెండుపదములందును పరా అను ఉపసర్గము గలదు. ఎఱ్ఱాప్రెగడ హరివంశమందు.
సీ. పా.

అభిగుప్తమంత్రులు నర్థంబులందుఁ బ
రాఙ్ముఖు లార్య భావానుగతులు...]

(అని కలదు) కాని—ఆఙ్, అపి ఈ రెండు మాత్రము లేవు. 'ప్రాప్తి' పదమున (కొకటికి) మాత్రము ఉభయములకు లక్ష్యము వ్రాసి- ఇటువలె కడమవిన్ని చూచుకొమ్మని (అప్పకవి గా)రన్నారు. ప్రాదులు విస్తారము లున్నవి. అంతమాత్రముచేత నందఱికి నెటువలె తెలియును. కొన్ని పదములు తెలియ పరుచుతున్నాము—

ప్రేక్షణ
అపాయ
అపేత
ఉపేంద్ర
సమాస
వ్యాసంగ
వ్యాకుల
ఉపోద్ఘాత
ప్రాంత
సమాకీర్ణ
ప్రత్యు ప్త
అపాదృత
నిరాధార
అపాన
వీక్షణ
ఉపాయ
సమేత
సమంచిత
ప్రాస
వ్యాలోల
వ్యాపార
ప్రోద్భూత
ప్రత్యంత
సమస్త
ప్రత్యగ్ర
వ్యపగత
నిరపేక్ష
వ్యాన
నిరీక్షణ
ఉపాయన
ఉపేక్ష
ప్రాంచిత
వ్యాస
వ్యామోహ
ఉదార
అభ్యుదయ
పర్యంత
సమగ్ర
అన్వర్థ
అత్యుష్ణ
ఉదంచిత
ఉదాన
ప్రోక్షణ
ఉపేత
అపేక్ష
ఉదంచిత
వ్యాకీర
వ్యాయామ
ఉదాహరణ
ప్రత్యాలీఢ
ఉదంత
అత్యుగ్ర
దురంత
నిరాతంక
ప్రాణ
సమాన

  1. 'పరాహ్న పదమొకటి' అను దగ్గరి నుండి ఎఱ్ఱాప్రెగడ సీసపాదాంతమువరకున్న [ ] లోని భాగము మూలప్రతియందు 'మార్జిన్' వ్రాయబడియున్నది.