ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రెడ్డి, ఎల్లారెడ్డి - ఈ మొదలగు వాటియందు ఆత్వము. రామిరెడ్డి, సోమిసెట్టి - ఈ మొదలగు వాటియందు ఇత్వము. అయ్యపరాజు, బయ్యపరాజు, సూరపరాజు, నారపరాజు, - ఈ మొదలగు పదములందు పత్వము. కృష్ణమరాజు, కోనమరాజు, కృష్ణమాచార్యులు, కొండమాచార్యులు ఈ మొదలగువాటి యందు మత్వము. 'యథాయోగ్య మన్యచ్ఛ వ్యవహారతః' అనుట వలన, నరసుపండా, వెంకుపండా- ఈ మొదలగు వాటియందు ఉత్వము. రాజు, రావు, రెడ్డి, సెట్టి, జెట్టి, రాయడు, నాయడు, ప్రెగడ- ఈ మొదలగు పదములు కలిసినపుడు పైన చెప్పిన అత్వాదులు వచ్చును. 59
8. ప్రాదియతి
లక్షణము—
"శ్లో॥ | ప్ర పరా ప్రతి ప ర్యత్యధ్యభ్యవానూప సంసృప | |
ప్ర, ప్రరా, ప్రతి, పరి, అతి, అధి, అభి, అవ, అను, ఉప, సమ్, సు, అప, ని, వి, నిర్, దుర్, ఉత్, అపి, అఙ్-ఇవి యిరువదియును ఉపసర్గలు. ప్రకారోపసర్గం బాదియగుటం జేసి ప్రాదు లనంబడును.
గీ. | ఆంధ్రమునకుఁ జొరని పరాజపులు మూఁడు | 60 |
గీ. | అబ్జయోని రజోగుణప్రాప్తిఁ దనరు | 61 |
(అ. క. 3-332, 3)
అని అప్పకవిగారు ఆంధ్రశబ్దచింతామణియందు చెప్పినారు. ఇందులో పరా, అఙ్, అపి- ఈ మూడు వేదమందేకాని లోకమందు లేవనుట. (అయితే) ఆ మూడింటిలో (పరా అను దానిని గూర్చి).