పుట:Sukavi-Manoranjanamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కొందఱు 'కవిత్రయమువారి ప్రయోగము లేదుగాన, మంచిది కాదంటారు. శ్రీనాథుడుగారు కవిత్రయమువారి కన్న తక్కువవారు కారు. అయినా[1]278
తిక్కనగారి ఉత్తరరామాయణము (3-62)
క.

అని గోకర్ణమునకుఁ జని
యనుజన్ములు తాను నెడ్డ నజు నిల్పి తపం
బొనరించి రత్తెఱం గె
ల్లను జెప్పెద వినుము నీవు రఘుకులతిలకా!

279
కాశీఖండము, ఉత్తర రామాయణము (నుండి) అప్పకవిగారు లక్ష్యములు వ్రాసినవేను. ఇచ్చట (వారు) దిద్దకపోవుటకు కారణము తెలియదు. (ఇక)280
అహోబలపండితులవారు కవిశిరోభూషణము (పు. 167) నందు

"అప్పకవినా యదుక్తం — యతౌ రలయోర్మిత్రతాస్తీతి లాక్షణికానా ముక్తి ర్నప్రామాణికీతి. 'లీలా మకరాంక చంద్రరేఖాంకు' రేత్యాదౌ రేఖాశబ్దస్య లాదిత్వమపి నైఘంటుకై రుక్తత్వా న్న రేఫాదిత్వమితి తదవిచారితాభిధానమే వేతి స్పష్టమేవ. ఏతేన, 'రాయంచ కాళ్ల దౌలకయ మన్నె' ఇత్యాది కవిప్రయోగాణాం నకించిద వ్యసామంజస్య మితి ధ్యేయమ్. ప్రాసే తు తదభిన్నత్వం కవిభి ర్న వ్యవహృతమితి జ్ఞేయమ్”

అని వ్రాసినారు. అప్పకవి తెలివితక్కువేగాని, ర ల లకు యతి చెల్లును. ప్రాసము చెల్లదని చెప్పినారు.281
కొందఱు లాక్షణికులు 'రాయంచ కాళ్ల దొరయకమున్నె' అని దిద్దినారు. దిద్దినవా రంతటా దిద్దవలె.282
ప వ లకు—
  1. ఇక్కడ 'అయినా ర ల లకు హరికథాసారము, ఎ. హ. (ఎఱ్ఱాప్రెగడ హరికథాసారము) రెండు పద్యాలు' అని మూలప్రతియం దున్నది కాని రెండు పద్యాలేవో వ్రాసిలేవు.