పుట:Sukavi-Manoranjanamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[1]తద్భవవ్యాజయతికి కవిత్రయము వారిలో నొకరి లక్ష్యము (గూడ) వ్రాయలేదు. (వ్రాసుతున్నాము).265
ఎఱ్ఱాప్రెగడ హరివంశము (పూ. భా. 9-47)
సీ.

(అవధరింపుము దేవ యాశ్చర్య మొక్కటి
             మన విల్లు పూజించు మందిరంబు
లోనికి నిద్దఱు లోకాధికంబగు
             తేజంబు గలవారు దేవనిభులు)
నవయౌవనులు మనోజ్ఞవిచిత్రగంధమా
             ల్యాలంకృతాంగులు నీలపీత
వసనులు దివినుండి వసుధపై (కుట్టిప
             డ్డట్టు లెవ్వరు వీర లని యెఱుంగ
నేరకుండ నేతెంచిరి వారిలోనఁ
దెల్లదామరఱేకుల ట్లుల్లసిల్లు
కన్నుదోయి నొప్పారెడు కఱ్ఱియాతఁ
డొకఁడు వెసఁ బుచ్చుకొనియె విల్లొక్కకేల.)

266

12. అభేదయతి

లక్షణము
గీ.

రలలు వపబలు దడలును లళలు తమకుఁ
దామె విరతులు నగు నభేదాఖ్య నొంది
సుకవి కావ్యములందు నీ క్షోణియందు
హీర హీరాబ్జ చంద్రాంగ వృషతురంగ.

267
  1. 'తద్భవవ్యాజయతికి...' నుండి సీసపద్యోదాహరణము వరకు మూలప్రతియందు వ్రాసి కొట్టివేయబడి ఉన్నది. కాగా తద్భవవ్యాజయతికి ఎఱ్ఱన గారి ఈ ప్రయోగము గ్రంథమునం దుండగూడదని వేంకటరాయడు భావించినట్లు కన్పించును. వివరములకు చూ. ఈ గ్రంథ పీఠిక.