పుట:Sukavi-Manoranjanamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. సంయుక్తయతులు

లక్షణము
తిమ్మకవి లక్షణసారసంగ్రహము
గీ.

వలుల యెడఁ బ్రయుక్తవర్ణముల్ గూడిన
యక్కరంబు మాత్ర లనువు మీఱ
తమకుఁ దామె విశ్రమములై విరాజిల్లు
క్ష్మాశతాంగ దక్షసవనభంగ.

202
లక్ష్యములు
కవి ధూర్జటిగారి (కాలహస్తీశ్వరశతకము)
మ.

'క్షితినాథోత్తమ! సత్కవీశ్వరుఁడు వచ్చె న్మిమ్ములం జూడఁగా'
'నతఁ డేపాటికవిత్వవైఖరిని' 'సద్యస్యావ్యనిర్మాత', 'తత్
ప్రతిభల్ వింటిమి, తిట్టుపద్యములొ?' 'చెప్పంజాలఁ' 'దైతే మముం
గ్రితమే సూచెను పొ'మ్మటందు రధముల్ శ్రీకాలహస్తీశ్వరా!

203
అందే
శా.

రాజన్నంతనె పోవు నా కృపయు ధర్మం బాభిజాత్యంబు వి
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వద్విప్రసంరక్షయున్
సౌజన్యంబు కృతం బెఱుంగుటయు విశ్వాసంబు, రాకున్నదు
ర్వీజశ్రేష్ఠుల కాగతంబు గలదా! శ్రీకాలహస్తీశ్వరా!

204
ఈ రెండుపద్యములం దున్న వన్నియును సంయుక్తయతులు.
స్త్నాన శబ్దము (నందు) తకారమున్ను గలదని యెఱుంగరు[1]. తకారయుక్తమైనందుకు లక్ష్యములు— 205
  1. 'స్నాన' శబ్దమున తకార మెట్లుండుటకు వీలున్నది ఆగమయతి (ఈ ఆశ్వాసము చివర) వద్ద ప్రదర్శింపబడినది.