పుట:Sukavi-Manoranjanamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పడు జగంబులు భోగైకపరతఁ దొల్లి
మాననీయుల కవసర మీని వారు
రాజ దండితుఁ డకృతాపరాధుఁ గూర
దండ దూషితుఁజేసి నతండు సూవె.

170
(మొదటిచరణము ఉత్తరభాగమున) 'అట్టి నీచు' స్వరము.
అశ్వమేధపర్వము (4-93)
క.

నీవును దల్లులు బంధు[1]
నావలి పరిజనులు హస్తినగరంబునకున్
రావలయు ధర్మజుని సం
భావనయును బడయుఁ డెసఁగు పరమసుఖంబుల్.

171
ఈ పద్యము పూర్యపు లాక్షణికులు అఖండవడికి లక్ష్యము వ్రాసినారు. అచ్చుపుస్తకములందు (పైపద్యము రెండవచరణము) "...జ, నావలియుం బరిజనములు హస్తినగిరికిన్...' అని వ్రాసినారు. ఇది అతికినట్లున్నదిగాని సాఫు లేదు.172
ఆశ్రమవాసపర్వము (1-131)
చ.

కనకము మేనిరత్నములు గ్రామములున్ హయగోవ్రజంబులుం
[2]దనియఁగ నిమ్ము సర్వవసుధామరకోటులకు న్నిజేచ్చ నీ
తనయులు పుణ్యలోకసుఖధాములునై విలసిల్లు నట్లుగా
ననుటయు నాంబికేయు హృదయంబున మోదమెలర్చె భూవరా!

173
వసుధామరులు, గోత్రామరులు, భూసురులు, మహీసురులు అనవలెగాని, భృమరులు, మహ్యమరులు, (వసుధాసురులు), గోత్రాసురులు, ధరాసురులు- (ఇత్యాదిగా) అనరాదు. 174
  1. ము. ప్ర. ...జ, నావలియుం బరిజనములు హస్తినగరికిన్'
  2. ము ప్ర. ‘దనియఁగ నిమ్ము సర్వవసుధాసురకోటులకున్...'