పుట:Sukavi-Manoranjanamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (5–84)
గీ.

ధూతపాపుఁడైన పూతాత్మకుండు ల
ఘ్వాశి యగుచు నింద్రియముల గెల్చి
మనములోన కామమును క్రోధమును కోర
నీక బ్రహ్మపదము నిచ్చఁ గోరు.

167
(చివరచరణమందు) ‘నిచ్చ' - ఎపుడు అని అర్థము గాని, కోరిక అని అర్థము గాదు.

...గ్రచ్చ కోరిక తమి కోర్కె యిచ్చ యనఁగ'

అని 'ఆంధ్రనామసంగ్రహము' (మానవ 27) పౌరాణికులు కోరిక యని యర్థము చెప్పుతారు కాని, పునరుక్తి దోషము సంభవించుచున్నది. 168
అనుశాసనికపర్వము (1-362)
గీ.

వారు పూజ లొనర్పఁగా గారవంపుఁ
జూడ్కి నద్దేవుఁ డందఱఁ జూచు చరిగె
మఱియునుం దత్ప్రదేశంబు మహితవహ్ని
[1]మయతఁజేసి భయంకరమై వెలింగె.

169
అందే (5–107)
సీ.

దాసత్వమొంది యదల్పులఁ దిట్టుల
             నాటులఁ బడుచుండు నట్టి నీచు
లప్పాట తోలుమేన నతిగర్వులై ప్రల్ల
             దమ్మునఁ బెక్కండ్రఁ దప్పులేక
తిట్టియు నడచియుఁ దిరిగిన వార లా
             పొలువలపైఁ గృపగలిమి మేలు
ధనిక గృహద్వారమునఁ బ్రతిహారి త
             మ్మాగంగ నుండి దైన్యమున దుఃఖ

  1. ము. ప్ర. 'మయతఁజేసి భయంకరమయి వెలింగె' ఈ పాఠ మందును అఖండయతి తప్పలేదు. పాఠాంతరముగూడ లేదు.