పుట:Sukavi-Manoranjanamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వప్నసంప్రవృత్తి సలిపెడు నరు[1]మాడ్కి
నింద్రియములతోడ నెఱయఁ బొరసి.

164
చివరచరణమందు అఖండయతి.
అందే (4-392)
సీ.

అనవిని బలదేవతాధీశుతో [2]నీకు
             నా విభవంబు గానంగరాదు
గుప్తమైయున్నది గుహయంచు నా కిచ్చ
             పుట్టినయప్పుడు పొలిచి తోచు
నది యట్టులుండి, నీ వధికుండ, వల్పుల
             యెదుర ఱజ్జులు పల్కు టేమి పెంపు
పొమ్ము దుశ్చ్యవన నీ పోయెడు తెఱుపున
             నావుడు నవ్వుచు నతనిఁ జూచి
మున్ను వలికినట్లు మోమోట లేక ప
లుటయు నతఁడు భూతకోటి మంచు
వోలెఁ దోచె విరియు బుద్ధిమంతులు దాని
కిచ్చ వగవ రింత యెఱుఁగవెట్లు.

165
అందే (6–440)

[3]నరుఁడు నారాయణుండును ననఁగ లోక
రక్షణార్థంబుగాఁగ ధర్మమున కేను
బుట్టినాఁడఁ గావునఁ బాండుభూపతనయ
నాకు ధర్మజుఁ డనియెడు నామమయ్యె.

166
  1. ము. ప్ర. 'మాడ్కి, నింద్రియములతోడ నెనయఁ బెరసి'
  2. 'నీకున్ + ఆ విభవంబు' అని వేం. రా. భావించినట్లున్నది. 'నాయొక్క విభవ'మన్నచో సందర్భమున కనుగుణముగును. అప్పుడు అఖండయతి గాదు.
  3. ము. ప్ర. 'నరుఁడు నారాయణుండు ననంగలోక...'