పుట:Sukavi-Manoranjanamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (2-99)
ఉ.

[1]నామనమార దీనిఁ గనునప్పుడె సంతసమయ్యెఁ జాలు నా
కీ మహనీయరత్నము వహింపఁగ నర్హుఁ డితండె యంచు నా
భూమిపుచేతఁ బెట్టుటయు భూవర యాతఁడు ద్రౌణి గౌరవ
శ్రీమది భక్తిపెంపుగ ధరించే శిరంబునఁ దాన ప్రీతుఁడై.

162
శాంతిపర్వము (1-108)
సీ.

దక్షుఁడై భూపతి దండనీతి సయింప
             కున్న సన్యాసులు నుత్పథప్ర
వర్తకు లగుదురు వావిరి నన్యోన్య
             ధనధాన్య పశుభూమి దారహరణ
మాచరింతురు జను లప్పాప మవ్విభు
             నొందు దండము హింసయుగఁ దలంప
వలదు దుర్వృత్తుల వధియించు రుద్రుని
             గోవిందు వాసవు గుహునిఁ [2]జూడు
మమ్మహాత్ములు తక్కు దుర్మార్గచరులు
దండితులచేత వినమె యధర్మమడఁగు
ధర్మమెసఁగు దండమున నర్థమును కామ
మును నదూష్యంబులై సిద్ధిఁ బొందు నధిప.

163
అందే(4-205)

ఆతఁడు కాలకలితమై కర్మమునకు సం
సారవర్తనంబు సలుపుచుండు

  1. ము. ప్ర. 'నామనమార దీనిఁగని నందముఁ బొందితి...
  2. ము. ప్ర... చూడు
    మా మహాత్ములు దక్కు నున్మార్గచరులు...' 'చూడుమా' అని కం. వీరేశలింగముగారు 1991 ప్రచురణలో ఉభయయతిగా దీనిని గుర్తించినట్లు ఉ.వి.వి. ప్రతి.