పుట:Sukavi-Manoranjanamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బరువడి రక్షించితి సం
గరము దెగినఁ దొలఁగి యిపుడు కాలవిడచితిన్.

159
(రెండవచరణమందు) 'ఇటు' స్వరము.
సౌప్తికపర్వము (1-61)
సీ.

పఱచిన వారికిఁ బగ మారు సలుపంగ
             నుత్సహించుట కడు నొప్పుగాదె
దైవయోగంబునఁ దగిన యుద్యోగంబు
             నీ మానసంబున నెలవు కొనియె
మాకు నీపూన్కి సమ్మత మది మేమును
             నీ తోడివారము నీవు డస్సి
యున్నవాఁడవు నిద్రయును లేకయున్నది
             [1]వేగిర పడియెద వేల యింత
నెమ్మి డప్పిదేఱ నిద్రించి వేగిన
తెలిచితోడ నత్యుదీర్ణవృత్తిఁ
గడఁగి మేము తోడ నడతేర నడరిన
యరిగణంబు గెలుతు నశ్రమమున.

160
అందే (2-81)
క.

ఏ నొక్కని పాండవ సం
తానార్థముగాగ నిత్తు ధర్మముల మహా
దానంబులఁ గ్రతువుల [2]జన
తా నందితుఁడగుచుఁ బెంపు దలకొనువానిన్.

161
  1. ము. ప్ర. 'వెడగర పడియె దీ యడవిలోన'
  2. 'జనతా + అనందితుఁడు' అని ' విరిగిన అఖండయతి. జనతా + నందితుడు' అనినచో అఖండయతి కాదు.