పుట:Sukavi-Manoranjanamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గొని యరుల పెను పడచి బ్రతు
కన వలయు నిహమ్ము పరము గలుగునె చెడినన్.[1]

155
కర్ణపర్వము (2-355)
ఉ.

మ్రొగ్గెడు వాహనంబులును మోములు వాడఁగ వాహనంబులన్
డిగ్గి తొలంగు సైనికు లనేకులు కష్టపు చొప్పు చొప్పడన్
దగ్గు సిడంబులున్ గులముఁ దన్నుఁ దలంచి యెదిర్చి యొంటిమై
[2]మ్రగ్గెడువారునై ధరాధిపు సైన్యము రూపు మాయఁగన్.

156
అప్పకవిగారు 'కురుధరావరు' అని దిద్దినారు. అందఱు 'ధరాధిపు' అనే అంగీకరించినారు. ఆ పద మతికి యున్నది. 157
శల్యపర్వము (1-87)
శా.

గంగానందనుపోటు మెచ్చక గురుం గాదంచు రాధాతనూ
జుం గీడాడుచు నీతఁ డెవ్వఁడొకొ యంచున్ శల్యుఁడే యిట్టివా
నిం గయ్యంబుల మున్ను గాన మనుచున్ వేభంగులం [3]జూపఱె
ల్లం గీర్తింప ధనుఃకలానిపుణలీలాభీలతం జూపెదన్.

158
అందే (2–337)
క.

గురుకర్ణుల యస్త్రాగ్నుల
[4]నెరసినయది మున్ను దీని నిటుగా నుండున్

  1. ఈపద్యమున అఖండయతి కన్పించదు. 'ఐనను' లో 'న' మీద అచ్చు విరుగదు. 'బ్రతుకనవలయు' నన్నప్పుడును 'క' మీద కూడ అచ్చు విరుగదు. 'బ్రతుకనేవలయు' నని యర్ధము. 'బ్రతుకు + అనవలయు' అని వేం.రా. పదవిభాగము చేసినట్లు తోచును. గాని అది సరికాదు.
  2. ము. ప్ర. 'మగ్గెడు వారునై కురుధరావరు...'
  3. ము. ప్ర. '... జూపఱె, ల్లం గీర్తింప ధనుఃకలా నిపుణ లీలాఖేలతన్ జూపెదన్'
  4. 'నెరయు' హలాదిగా నున్నదనవలెను. 'నెరసినయది' అని ము. ప్ర. 'అగ్నులన్ + ఎరిసిన అని విభాగము. అప్పు డఖండయతి కాదు.