పుట:Sukavi-Manoranjanamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాలోకింపఁగ [1]వలసిన
నీ లోనికి దివ్యదృష్టి నిచ్చెద పుత్రా!

151
అందే (2–187)
క.

పదిటం ధృష్టద్యుమ్నునిఁ
బదియమ్ముల నతనిసూతుఁ బటురయమున ను
న్మదుఁడై నొప్పించిన కెం[2]
పొదవిన మోమల్లనవ్వు పొలుపున నొప్పెన్.

152
ద్రోణపర్వము (1–64)
ఉ.

ప్రాయపుకల్మి నొక్కట నభవ్యధృతి న్మహనీయశీలతన్
సాయకపంజరం బటుభుజావిభవంబునఁ గార్యతంత్ర[3]శి
క్షాయతబుద్ధి వృద్ధుఁడవు గావె ధరామరచర్య మున్ను గాం
గేయుఁడు మాకు నెల్ల నెఱిఁగింపఁడె నీదు మహానుభావమున్.

153
అందే (3–59)
గీ.

[4]నఱికి తోడన హరిమేన నతని యొడల
నేయు గురు విల్లు విఱువంగనేయఁ దలఁచె
నక్కిరీటి యాలోనన నతని మౌర్వి
వికలముగఁజేసె నాధనుర్వేది గురుఁడు.

154
అందే (4–248)
క.

విను మడుగులపైఁ బడియై
నను నెంగిలిఁ గుడిచియైన నరులకుఁ బగ లోఁ

  1. ము. ప్ర. ‘...వలసిన, నే లోనికి దివ్యదృష్టి నిచ్చేడఁ బుత్రా'
  2. ము. ప్ర. ... కెం, పొదవినమో మలతినవ్వు నొప్పున నొప్పెన్'
  3. ము. ప్ర. ‘....శి, క్షాయుత బుద్ధివృద్ధుఁడవు గావె...'
  4. ము. ప్ర. 'నఱికి తోడన హరిమేన నరునియొడల'