పుట:Sukavi-Manoranjanamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(మూడవచరణము ఉత్తరభాగమున) “పరపు-అయిన” స్వరము.
అందే (7–412)
చ.

పుడమియు నర్థసంపదయుఁ బొల్పఱ వైరుల పాలుజేసి యీ
యడవికి వచ్చి భీకరమృగావలి పొందున నున్న వీరి వె
న్నడికొని యిట్లు సేసెనె యనాథులవోలె విధాతృఁ డింక నె
క్కడ జనువాఁడ నేది కడగాఁ దరియింతు దురంతదుఃఖముల్.

142
విరాటపర్వము (1-234)
ఉ.

ఆయతబాహులు న్వెడదయైన సమున్నతవక్షమున్ [1]సరో
జాయతలోచనంబులు ప్రసన్నముఖంబు నుదాత్తరేఖయున్
(గాయజుఁ గ్రేణిసేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్రమ
శ్రీయును బెంపునుం గలుఁగఁజేసి విధాతృఁడు పేఁడిఁ జేసెనే).

143
అందే (5-19)
క.

వివిధములగు లక్ష్యంబుల
నవలీలం దునియనాట నవయఁగఁ జేయన్
భువనైకధన్వి నత్యు
గ్రవిచేష్టితు నోర్చి పరశురాముం బోరన్.

(రెండవచరణమందు) “నవియగ" అను పదమందు అచ్చులేదు.
(ఉదాహరణకు) అరణ్యపర్వము (4-118) నందు
సీ. గీ.

కలశభవుఁ డగస్త్యుఁ డలిగి యత్యుగ్రాహి
నగుమ యనుచు శాప మనఘుఁ డిచ్చె.

144
  1. 'సరోజాయత' అని పెక్కుప్రతులయం దున్నదని చెప్పుచు ఉ. వి. వి.ప్రతిలో 'కాని యతిభంగము' అని కుండలీకరణమున వ్రాయబడినది. కాగా ఇది ‘అఖండయతి’యని స్పష్టము.