పుట:Sukavi-Manoranjanamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ననుజపక్షమ్ము లే నిమ్మహాచలమునందు
[1]నాటగోలెను నెచటికి నరుగనేర
కున్నవాఁడ నాతమ్ముఁ డెట్లున్నవాఁడొ
యెఱుఁగ, నెఱిఁగింపరే నాకు నిష్టమెసఁగ.

(సీస గీతపు రెండవ చరణమందు) "అరుగనేర" అని స్వరము. 140
అందే (7-406)
సీ.

అపగత జనశబ్దమై యనభివ్యక్తి
             మార్గమై యవిరలదుర్గశైల
తరుగుల్మవల్లీవితానమై గజసింహ
             శరభశార్దూలసూకరలులాయ
బహులమై బహువిధపక్షికోలాహల
             భయదమై కడుపరపైన యడవి[2]
ననుజుల వెదుకుచు ననఘుండు సని కాంచె
             కమలాకరంబు తీరమునఁ బడిన
వారిఁజారువంశవరుల భీమార్జున
యముల నమితబలుల విమలమతుల
ప్రలయపతితలోకపాలసంకాశుల
భూరిపుణ్యధనుల వీరవరుల.

141
  1. ము. ప్ర. 'నాఁటఁగోలె నెచ్చటికిఁ జనంగ నేర '
  2. ఈసీసము నన్నయగారి సీసపద్యరచనాపద్ధతి ననుసరించి సీసపాదపూర్వదళమున సరూపాక్షరయతి, ఉత్తరదళమున ప్రాసయతి చెల్లెడుతీరుకు చెందినది. తృతీయపాదమున ఉత్తరదళమున 'పరమైన' అని అన్న చో పద్ధతి (సరూపాక్షరయతి చెల్లుటవలన) చెడును. సా.అ. ప్రతి. ఉ.వి. ప్రతియందు పాఠ మిట్లే యున్నది. కాని "భయద మై కడుపర-వయిన యడవి' యని యున్నచో ప్రాసయతి చెల్లి సీసము సరిగా నుండును. (ఎఱ్ఱనగారు సీసపద్యరచనలో యతి ప్రాసయతుల చెల్లింపులో నన్నయగారినే భారతమున అనుసరించినారు. అప్పుడు ఈ అఖండయతి చెల్లినదనుటకు వీలుండదు.