పుట:Sukavi-Manoranjanamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మునివరేణ్యుశాపమునఁ జేసి యప్పాట
నవయుచున్నవాఁడ నాటఁగోలె.

145
(అను పద్యము చివరచరణమున “నవయు”లో అచ్చు లేదని తేలును.
ఉద్యోగపర్వము (2-259)
క.

దేవత లేటికి పార్థుఁడు
దేవసముఁడె గాఁడు వాఁడు దివిజులచేతం
బోవని దైత్యులఁ జంపడె
[1]నీవును నీవారు నతని నెఱుఁగ(రె చెపుమా).

146
అందే (3–165)
క.

అనవుడు భీష్ముఁడు ధృతరా
ష్ట్రున కిట్లను నీవు నీకొడుకు నేమేమి
చ్చిన నొకటి యీఁగి లేకు
న్నను వేరొక్కటి దలంచు నా కేశవుఁడున్.

147
అందే (3–188)
సీ.

నీశిక్షఁ బెరుగుట నీతిమంతులు పుణ్య
             పరులు శూరులుగదా పాండుసుతులు
సుఖవృత్తిఁ బెక్కండ్రు సూరెలఁ గొలువ నుం
             డెడు వార లిడుమలఁ బడుచు నిర్జ
నంబైన కానలోనన యెట్టులుండిరి
             ననుబెట్టి నాయెడఁ గొనుచుఁ జనిరి
[2]నేను వడ్డింపంగ నింపారఁ గుడిచి మె
             త్తనిసెజ్జ నిద్రించి (వినుత)భద్ర

  1. ము. ప్ర. 'యీపును నీవారు నతని నెఱుఁగరె చెపుమా'
  2. ము. ప్ర. 'యేను వడ్డింపంగ నింపారఁ గుడిచి... '