పుట:Sukavi-Manoranjanamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (1–147)
చ.

ఒకచిగురాకుకొమ్మ పిక మొక్క ప్రసూనలతాగ్రసీమఁ దేం
[1]ట్లొకఫలశాఖ రాచిలుకలున్ రొదసేయఁగ గాడ్పువొందు వా
యక పయివెన్నెల ల్వొలయ నామని యొప్పులఁ జాల నందమౌ
నొకయెలమావిక్రింద మరుఁడో యనఁగా నరుఁడుండె వేడుకన్.

108
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-195)
క.

ఈరీతి శిరసు మజ్జన
[2]మారోగణమైన సుమణి మయపాదుక లొ
య్యారగముగ మెట్టి యుడిగపు
నీరజముఖి కేలుపట్టి నృపుఁ డిం పెసఁగన్.

109
అందే (2–281)
చ.

మిగుల దృఢంబు జేసి వగ మీరడుగం దగఁ బంపఁజెల్లు ని
మ్మగువనె యింక నిక్కమగు మాటకు సందడగింపు డూరకే
బెగడకు మారు నాఱడిని బెట్టఁగఁ జెల్లదు వింటలేదె యిం
ట గెలిచి రచ్చ గెల్వుమను నానుడి నానుడి నిశ్చయంబుగన్.

110
చివరి (చరణనుందు) అనునాసికయతిచేత వచ్చిన యఖండయతి.
అందే (2-144)
ఉ.

కావక రాజుచిత్తము వకావకలై తెగఁ జూచునట్టు లా
హా, విపరీతమైన పలుకాడెడ నంటివి మున్వినాశకా
లే విపరీతబుద్ధి యని లెస్స బయల్పడఁ జెప్పినారె కా
నీ విధియాడు మీయనఁగ నీ విధి యాడెదుసుమ్మి భామినీ!

111
చివర (చరణమం దఖండయతి)
  1. ము. ప్ర. '...దేం, ట్లొకఫలశాఖ రాచిలుకయున్ రొదసేయఁగ...'
  2. ము. ప్ర. 'మజ్జన, మారోగిణమయి మణీమయవుఁబాదుక...'