పుట:Sukavi-Manoranjanamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (4-48)
ఉ.

ఏనుఁగు నెక్కి భేరి మొఱయించుచు నిస్సహణాతిభూరిని
[1]స్సాణము లుల్లసిల్ల జలజాప్తకులేందుని యాజ్ఞ...’

105
అందే (5–195)
సీ.

అక్కథకుఁడు శౌనకాదిసన్మునులకు
             రుక్మాంగదుని కథ రూఢిగాను
జెప్పి, యో మునులార చిరతరభక్తితో
             మది మెచ్చి యీ కథ చదువువారు
పుస్తకంబు లిఖించి పూనిక వినువారు
             కలశాంబునిధిశాయి కరుణచేత
ధనధాన్యపుత్రపౌత్రాయురైశ్వర్యవై
             భవశత్రుజయము సద్భక్తి గలిగి
యంత మీఁదట సిద్ధవిద్యాధరోర
గులకు దుర్లభమైన వైకుంఠపురము
నందు నిజపుత్రపౌత్రదారాన్వితముగ
నూర్జితప్రాభవంబున నుందు రనుచు.

106
చేమకూరవారి విజయవిలాసము (2-84)
క.

[2]చనుఁ డచ్చోటికి నిపుడిం
పెనయ నగ నదుఃఖ పంచభిస్సహ యనుటన్
వినియుందురెకద యేటికి
మనమున నుమ్మలికనొంద మదవతులారా!

107
  1. ము. ప్ర....ని, స్స్వానము లుల్లసిల్లఁ జలజాతహితేందు విశాలవీథులన్'
                                              (వావిళ్ల ప్రచురణ. 1954)
  2. ము. ప్ర. 'చనుఁ డచటికి నిపు డింపెన
               య, 'న దుఃఖం పంచభిస్సహ' యనంగా మున్...'