పుట:Sukavi-Manoranjanamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (4-111)
చ.

అతిశయరోషసంయుతమహాహిభయంకరమండలాగ్రఖం
డితరిపుదంతికుంభతటనిర్ణితమౌక్తికరాజిఁ బూని యా
[1]తతజయలక్ష్మికిన్ పరిణతాంగముగాఁ దలఁబ్రాలు వోయు బా
త్రతగల క్షత్రవంశజు కరంబులు హాలికవృత్తి కోర్చునే.

101
అందే (5-83)
చ.

[2]పరహితమార్గవర్తన శుభాకర నన్నొకకొంత సత్కృపా
సరణి గనుంగొన న్వలయు సంపద గల్గినదానవోలె ని
ష్ఠురగతి మాటలాడెదవు చూడఁగ నే నిరుపేదరాల నె
వ్వరు మరి దిక్కులేరు తగవా నను శోకపయోధి ముంపఁగన్.

102
చతుర్థచరణమందు కాకుస్వరయతి.
రుక్మాంగదచరిత్రము (4-132)
క.

తెలుపెక్కె దిశల వెన్నెల
బలుపెక్కె చకోరములకుఁ బండువులయ్యెన్
బొలుపెక్కెఁ గలువలకు మఱి
నలుపెక్కెం జక్కవలకు నల విరహులకున్.

103
అందే (4–184)
క.

ఆఁకటఁ జిక్కె బలంబుల
కేకరి పెను దప్పిఁ బెదవు లెండఁగ నేడి
ట్టీకలములోన నూరక
[3]నాఁకటికిని నవయనని మనం బురి యాడన్.

104
  1. ము. ప్ర. '...యా, యత జయలక్ష్మికిన్ బరిణయాంగముగా...'
                                                 (వావిళ్ల ప్రచురణ. 1916)
  2. ము. ప్ర. 'పరహితమార్గవర్తన శుభంకర...'
                                                (వావిళ్ల ప్రచురణ. 1918)
  3. ము. ప్ర. 'నా కేటికి నవయ నని మనం బురియాడన్'
                                                (వావిళ్ల ప్రచురణ 1954)