పుట:Sukavi-Manoranjanamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
హరిశ్చంద్రోపాఖ్యానము (2-180)
ఉ.

నేరవు సౌఖ్యమందు ధరణిశ! యజీర్ణముఁ బొందునంచు నా
హారము మాని పెల్లొదవు నాఁకటిచే కృశమై చరించుటల్
సారవివేకమా తలఁప సయ్యన నీ యెలదీఁగెబోఁడులన్
గౌరవశీల! గైకొనుము గాదుసుమీ మది సంశయింపఁగన్.

98
అందే (3–158)
చ.

అలుక జనింపఁ గౌశికమహాముని యేమరిపాటు భీమభం
గులఁ జనుదెంచి మాధనము గొబ్బునఁదెమ్మని యానవెట్టినన్
గలుగుచు నే యుపాయమును గానక నిన్నును నీ తనూజుఁ గొం
[1]దలమున విక్రయించు వసుధాధిపుఁ డెవ్వరినైనఁ జెచ్చెరన్.

99
అందే (4-20)

కుముదమిత్రోపలగోపురంబులచేత
             విద్రుమప్రాకారవితతిచేత
మరకతహరినీలమండపంబులచేత
             బహుశాతశాతకుంభములచేతఁ
జాల దీపించు ముత్యాలమ్రుగ్గులచేతఁ
             గనుపట్టు పట్టుమేల్కట్లచేతఁ
గమనీయపద్మరాగచ్ఛత్రములచేత
             వృషరాజకేతనశ్రేణిచేత
మహితకర్పూరధూపధూమములచేత
నన్యమాణిక్యనీరాజనములచేత
శంఖభేరీమృదంగఘోషములచేత
[2]వెలయు నవ్విశ్వనాథు దేవేశుఁ గాంచి.

100
  1. ము. ప్ర. '...కొం, దలమున విక్రయించు వసుధాధవు...'
                                              (వావిళ్ల ప్రచురణ. 1916)
  2. ము. ప్ర. 'వెలయు నవ్విశ్వనాథుదేవళముఁ గాంచె'
                                             (వావిళ్ల ప్రచురణ. 1916)