పుట:Sukavi-Manoranjanamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (3–60)
క.

చాకున్న నీదు ముక్తులు
శ్రీ కాశీక్షేత్ర మెవ్వరికి నే నిక్కం
బీ కుధరమిచ్చు శిఖరా
[1]లోకనమాత్రమున ముక్తు లుల్లసిలంగన్.

94
చాకున్న—వకారలోపము.
అందే (5-304)
ఉ.

యంత్రితభక్తిభావమున నగ్ని సమింధన సామిధేని రు
ఙ్మంత్రము లుచ్చరించుచు సమగ్రతరారణిమంథనక్రియా
తంత్రము లాచరించి వసుధావరముఖ్యులు వీతిహోత్రు నా
మంత్రణ సేయలేరయిరి మచ్చరికించియుఁ గాశికాపురిన్.

95
పారిజాతాపహరణము (5-68)
ఉ.

దావవభేది సత్యయును దాను యథోచితవృత్తి మంగల
స్త్నానమొనర్చి శుభ్రవసనంబులు గట్టి యనర్ఘరత్నభూ
షానివహంబుఁ బూని హరిచందనచర్చ వహించి బంధువృ
[2]ద్ధానుమతిన్ సులగ్నమునఁ దద్వ్రతదీక్ష వహించె నయ్యెడన్.

96
నంది మల్లయ కవిన్ని, ఆయన మేనల్లుడు ఘంటా మలయమారుత కవిన్ని రచించిన 'ప్రబోధచంద్రోదయము'
శా.

శ్రీ నిత్యంబుగ నిచ్చుగాత కరుణాశ్రీమత్సుధారాశియై
నానాజీవులలోన రత్నములలోనన్ సూత్రముంబోలెఁ దా
లీనుండయ్యు జగత్కరండక నిచోలీభావముం దాల్చు బో
ధానందైకమయుండు శంకరుఁ డనంతస్వామి గంగయ్యకున్.

97
  1. ము. ప్ర. ...లోకనమాత్రమున ముక్తులు కురంగాజీ
  2. ము. ప్ర. ....వృద్ధస
    ఖ్యానుమతి న్సులగ్నమున నావ్రతదీక్ష వహించె నయ్యెడన్.
                                                 (ఎమెస్కో ప్రచురణ)