పుట:Sukavi-Manoranjanamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అఖండవడిలక్షణమందు (కవిజనాశ్రయమున) '... తదీయానుగుణాక్షరంబుఁ గొనియైనను జెప్పఁగ నొప్పు......' అనగా, ఏ యక్షరమున కా యక్షరము సరే, లేని పక్షముకు ఆ యక్షరముకు చెల్లిన యే యక్షరమైనా చెప్పవచ్చునని తాత్పర్యము. గనుకనె, బిందువు దాపలగల బకారము మకారముకు (పైపద్యమున నాల్గవచరణమందు) యతియైనది. 'ఈ దాంపత్య' మని స్వరమున్నందున నఖండవడి, స్వరము లేకపోతే బిందుయతి. ఇదే '... తదీయానుగుణాక్షర...' మనుట. ఈ రహస్యము తెలియలేరు మరియును——89
శ్రీనాథుని నైషధమునందే (7-184)
ఉ.

[1]క్రిక్కిరి సున్నచన్నుఁగవ కేవలఁ గాంతియుఁ బంచబాణు క్రొ
వ్వెక్కఁగఁజేయు హస్తయుగ మెత్తిన హారభరంబు [2]పేర్మి గై
పెక్కి ప్రసూనముల్ గురియు వేనలి వీడిచి కొప్పు వెట్టుచో
చొక్కుల పెట్టి భూవిభుని చూపుల కోమలి బాహుమూలముల్.

90
కైపు-ఎక్కి-కైపెక్కి. స్వరము వ పలకు అభేదమునైన అఖండయతి. 91
శ్రీనాథుని కాశీఖండము (1-33)
క.

అంభోధి వలయితావని
[3]సంభరణ ప్రౌఢ నిజ భుజార్గల యుగలీ
సంభావిత కిటి కచ్ఛప
కుంభీనస సార్వభౌమ కులకుధరునకున్.

92
అందే (6–141)
ఉ.

కైటభదైత్యవైరి యధికంబగు నేర్పున మన్నుఱేని కు
చ్చాటన మాచరించి తన జక్కి ఖగేంద్రుని బంచెఁ గ్రమ్మఱన్
హాటకలేఖ దానును గజాస్యుఁడు లక్ష్మియుఁ జేసినట్టి కై
లాటమునన్ ఘటిల్లె సకలార్థము దేవరయాజ్ఞపెంపునన్.

93
  1. ము. ప్ర. ‘క్రిక్కిరి చన్నుదోయి యిరు గ్రేవల'...
  2. ము. ప్ర. '... పేర్మికిన్
    విక్కి ప్రమానము ల్గురియు వేనలి వీడిచి...'
  3. ము. ప్ర. 'సంభరణ ప్రౌఢ నిజ భుజయుగ యుగళీ'