పుట:Sukavi-Manoranjanamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తిమ్మకవి లక్షణసార సంగ్రహము (2-120)
గీ.

హల్లునకు హల్లు వడి యిడునపుడు దాని
తుదిని స్వరము ఘటిల్లిన నది యఖండ
వడి యనగఁ బొల్చుఁ గృతుల దేవాధిదేవ
యనుచుఁ జెప్పిన శైలకన్యాసహాయ.

85
లక్ష్యములు
నూత్నదండి ఆంధ్రభాషాభూషణము (16)
క.

ఆదులు స్వరములు నచ్చులు
కాదు లొగిని వ్యంజనములు హల్లులనంగా
మే నెల్లెడఁ జెల్లును
[1]కాదులు నై రైదుఁ గూడఁగా వర్గంబుల్.

86
శ్రీనాథుని నైషధము (4-90)
గీ.

కాంత! యశ్రుబిందుచ్యుతి కైతవమునఁ
దివిరి బిందుచ్యుతక కేలిఁ దవిలె దీవు
సారె సారెకు నాదు సంసారమునను
సారముగఁ జేయవే సారసాభనయన!

87
అందే (6–76)
శా.

వైదర్భీ బహుజన్మనిర్మలతపోవర్ధిష్ణు తల్లోచన
స్వాదు ప్రౌఢవిలాస మీ వసుమతీసంజాత తృష్ణాయుధం
బాదిత్యాన్వయ సార్వభౌమ సుకృతాహంకార[2]దుష్ప్రాభవం
బీ దాంపత్యమునం జిరాయువయి నెమ్మిం బొందుగా కెంతయున్.

88
  1. ము. ప్ర.'.......కాదులు నైదైదు గూర్పనగు వర్గంబుల్'. (వావిళ్ల ప్రచురణ. 1949.)
  2. ము. ప్ర. ......దుష్ర్పాస భై,
              మీ దాంపత్యమునం జిరాయువయి నెమ్మిం...