ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇక్కడ మాత్రము వర్గయతులేమి? కకారముకు కకారముంటే ప్రాణియతి యేమిః నాలిగింటిలో నరలేక నిలిచిన అని తమరే స్పష్టముచేసిరి. ప్రాణియతులని పేరుమాత్రమే గొప్పకాని, విశేషము లేదు. (ఇక) ఋజుయతులనగా, యకార హకారములకు వ్రాసినారు. ఇవియును, అంత్యోష్మయతులు-అనగా, శవర్ణ షకారములకు వ్రాసినారు, ఇవియును 'సరసయతు'లని సుప్రసిద్ధము లైయున్నవి. (మఱి) ఏకతరయతులనగా, రేపముకు రేఫము ఱఆకారముకు అకారము ఏకతరయతులని వ్రాసినారు. ఈ రెండును, య-ల-వ ఈ మూడు ఏ యక్షరమున కాయక్షరము యెక్కటి యతియని పండిత పామర సాధారణమైన యతి. అటువంటిదానికి, రేఫమునకు రేఫము. ఱకారమునకు ఱకారము ఏకతరయతి యనుటయు, య-ల-వ —ఈ మూడక్షరములు ఏయక్షరమున కాయక్షరము యతియగునపుడు ఏ యతో నలుబదొకటి యతులలో చెప్పకపోవుటకు వారి సామర్థ్య మేమనుకోవలెః (ఇక) ప్రత్యేకయతులనగా— 14
గీ. | అరయ శార్జంబు హరిచేతి యది యనంగ | 15 |
అని వ్రాసినారు. మొదటి (చరణమున) స్వరయతి. రెండవ (చరణమున) వర్గయతి. (మఱి) భిన్నయతు లనగా—
"గీ. | ఎదను లచ్చిని హరి ధరియించె ననఁగ | 16 |
(అని వ్రాసినారు.) మొదటి చరణమున) సరసయతి. రెండవ (చరణమున) ఎక్కటియతి (కావున) ఇటువలె క్రొత్తపేరు లుంచుటకు పనిలేదు. ఈసప్తవిధములు నామనిర్దేశములు మాత్రమే క్రొత్తగాని, దశవిధయతులతో సుప్రసిద్ధములై పండితపామరసాధారణముగా నందఱు నెఱింగినవవును. (ఇక) మవర్ణ విరామము :—17
సీ. | మర్దిత దైత్య సంయమి మనోబ్జాదిత్య | |