పుట:Sukavi-Manoranjanamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(అయితే) కొందఱు లాక్షణికులు
ఆదిపర్వము (1-70) నందలి
శా.

ఏ డక్షోహిణు లెన్నఁ బాండవబలం బేకాదశాక్షోహిణుల్
రూడిం గౌరవసైన్య మీ యుభయమున్ రోషాహితాన్యోన్యమై
(యీడన్బోవక వీఁకమైఁ బొడువఁగా నేపారు ఘోరాజి న
ల్లాడెన్ రాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులున్.)

255
అంగర బసవయ్య ఇందుమతీకల్యాణము నందలి
ఉ.

బీదశచీవిభుండు దితిబిడ్డ లవార్యులు వారు పల్మరున్
బాదలు పెట్టఁగాఁ జెఱలువట్టఁగ నుండుట భారమంచు రం
బాది మరున్నివాసలసదప్సరసల్ చనుదెంచి వచ్చిరో
నా, దతఫుల్లపద్మవదనల్ విహరింపుదు రప్పురంబునన్.

256
కర్ణపర్వము (3-55) నందలి
క.

కాదేని బిరుసులాడక
సాదులమై వినయమొప్పఁ జని కురునాథుం
డేది పనిచినం జేసి ద
యాదృష్టి నతండు సూచు నట్లుండదగున్.

257
స్త్రీపర్వము (2-40) నందలి
క.

విదురుఁడు తండ్రియుఁ దనకుం
బది వేల్విధములను జెప్పఁ బాటింపఁడు దు
ర్మదమునఁ దగియెడు బుద్ధులు
విది మూడిన మర్త్యుఁ డేల వినును హితోక్తుల్?

258

—అని యీ పద్యములందు, రూడి, బీద, సాదు, విది —యీ పదములు
తద్భవములని తద్భవప్రకరణమందు వ్రాసినారు.[1]

  1. వీటిని తద్భవములందు వ్రాసినవాడు కూచిమంచి తిమ్మన. (లక్షణసారసంగ్రహము 1.80-84 )