(ఇక) ద్వితీయ చతుర్థ వర్ణములకు లక్ష్యములు —
ఆదిపర్వము (2-201) —
ఉ. |
కాదన కిట్టిపాటి యపకారము తక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసిచేసి నృపపుంగవ! నీవు ననేకభూసురా
సాదితసర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్ హుతవహోగ్రసమగ్రశిఖాచయంబులన్.
| 250
|
విరాటపర్వము (1-301) —
క. |
ముదమొదవ రమ్యహర్మ్యము
మదినిలుపున నిష్టసఖులతోడ విహారా
స్పదమగు నెలవున మెలఁగెడు
సుధేష్ణ తజ్జాలకములఁ జూచెం బ్రీతిన్.
| 251
|
ద్రోణపర్వము (5-170) —
క. |
వింధ్యాద్రిఁ బోలు నా ప్రతి
వింద్యుఁ డచలితోగ్రమూర్తి వెలయ నిలచి గ
ర్వాంధ్య మెడలఁగను దీప్తా
వంధ్యాస్త్రము లక్కుమారవరుపైఁ బఱపెన్.
| 252
|
అలసాని పెద్దకవి హరికథాసారము (ఆనందరంగరాట్ఛందము 3-66)—
క. |
ఆదేవోత్తముఁడు సుధాం
భోధి వటైకాగ్రిమదలమున బాలుండై
చేదోయిచేత దక్షిణ
పాదము గొని నోటఁ జేర్చి పకపకనగుచున్.
| 253
|
ఎఱ్ఱాప్రెగడ సంక్షేపరామాయణము —
క. |
ఆ దశరథసూనుండు ప
యోధిజలం బింకఁ జేసి యొకశరమునఁ గ్ర
వ్యాదవిభుఁ దునిమి సీతను
మోదంబునఁ జేకొనె సురపుంగవు లెన్నన్.
| 254
|