5. స్వవర్గజప్రాసము
లక్షణము —
గీ. |
వర్గు మొదటి వర్ణము మూఁడవదియు నైన
వర్ణమును మఱియును రెండవదియు నైన
వర్ణము చతుర్థ వర్ణంబు ప్రాసమగు స్వ
వర్గజ ప్రాసమన, రిపువర్గశమన!
| 245
|
ప్రథమ తృతీయ వర్ణములకు లక్ష్యములు :
ఆది పర్వము (8-259) —
చ. |
పెటిలి సువర్ణపర్వతము పెక్కుతెఱంగుల వ్రయ్యునట్టు ల
ప్పుడు వివిధప్రకారముల భూరిశిథావలి ఖాండవంబు న
ల్గడఁ గడుఁ బర్వఁగాఁ బెరసి కాల్పఁదొడంగె హుతాశనుండు చే
ట్పడఁగ వనంబులోని మృగపక్షిభుజంగమభూతసంఘముల్.
| 246
|
విరాట పర్వము (1-135) —
ఉ. |
ఎండకు వానకోర్చి తన యిల్లు ప్రవాసపు చోటునాక నా
కొంటి నఱంగితిన్ నిదురకుం దఱి తప్పెను డప్పివుట్టె నొ
క్కండును నెల్లరో యనఁగ కార్యముగల్గిన నేలనేలు నా
తం డొకచాయ జూపినను దత్పరతం బని సేయు టొప్పగున్.
| 247
|
—అచ్చుపుస్తకములందు 'నా, కొండు నలంగుదు' అని వ్రాసినారు. స్వవర్గజ
ప్రాసముకు లక్ష్యము వ్రాసిన పద్యము (ఇది,) నాలుగు చరణములందు డకార
ములే ఉంటే యీ పద్యము లక్ష్యము (గా) వ్రాయ పని లేదు.248
ద్రోణపర్వము: (4-89) —
క. |
అటుకులు తిన్నట్లగునే
కడుపున కుట్లెత్తినపుడు కడు బఱచితి నా
డొడ లెఱుఁగక పాండుసుతుల
నుడిగి నుడుగ వలసె నిప్పు డొకసాత్యకిచేన్.
| 249
|