శాంతిపర్వము (4-374) —
క. |
శత్రుజనులఁ జెఱచుటయును
మిత్రులఁ బ్రతికించుటయును మిన్నక యాస
త్పాత్రక సంపదయనఁగ వి
ధాతృఁడు చెందించుఁజూవె తఱితోఁ బురుషున్.
| 221
|
క్రాముడి గల హల్లులు లేని హల్లులు ప్రాసమగును.222
లక్ష్యములు - భాస్కర రామాయణము —
క. |
నాకింకను దిక్కెవ్వరు
శోకాంబుధి నెట్లు గడతు శూరతమై భూ
లోకాధిపసుతు ననిలో
నే క్రియ నిర్జించువాఁడ నెట్టిది వెఱవో?
| 223
|
నాచన సోముని హరివంశము —
శా. |
నాతో మార్కొనలేరు నిర్జరపురీ నాగేంద్ర బృందారకా
రాతుల్ మున్నుగ దేవసంఘములు బోరం ధీర సాంగ్రామికుం
డీ త్రైలోక్యమునందు గల్గఁడు రణం బెచ్చోట లేకుండఁగా
చేతుల్ వేయు వృథాభరంబగుచు వచ్చెన్ దేవ యీ మేనికిన్.
| 224
|
ఎఱ్ఱాప్రెగ్గడ హరివంశము —
క. |
భూపతివై యటఁ బుట్టిన
నీ ప్రెగడల మగుట మాకు నిక్కము వాంఛా
రూపం బని వలుక తదా
లాపం బా పక్షి సముపలాలన జేసెన్.
| 225
|
దేవీవిజయము —
గీ. |
వాక్త్రినేత్రాంగనా శచీ శక్తు లధిక
సంభ్రమంబున కుంభి నికుంభ దైత్య
హంత్రిఁ బూజింపుదురు త్రయీ మంత్రములను
(స్తోత్రములు చేసి మంగళారాత్రిక లిడి.)
| 226
|