పుట:Stree Neetideepika.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చాలలేదని వగఁబొందుచాన సతము
వ్యాధి లేనట్టి బాధను బడుచు నుండు. 40.

తే.గీ. సౌఖ్య మొక్కడనో విశేషంబుగాఁగఁ
గలుగుననుకొంట భ్రమసుండు కలుకులార!
కాపురము సేయుచుండు సౌఖ్యంబు సతము
తనివి గల దేని, నిలిచి మీమనసులందె. 41.

ఆ.వె. తుష్టి లేకయున్న, దొరకదు సౌఖ్యంబు,
కోట్లకొలఁదిధనము కూడియున్నఁ
గుడువఁ గట్టనున్న, గొప్పగృహములున్న,
నొడలినిండ లక్షతొడవు లున్న. 42.
                        త్యాగము

తే.గీ. "తాను జేసినధర్మంబె తన్నుఁగాచు"
ననెడు లోకోక్తి చిత్తంబునందు నిలిపి,
భర్తయును బంధువులు నియ్యఁబనిచినట్టి
ద్రవ్యమున బీదసాదలఁ దనుపవలయు. 43.

తే.గీ. త్యాగ మొనరింప నగునన్న యాసచేత
ధవుఁడుఁ జుట్టంబు లిచ్చినధనము గాక
తాను జాటుగఁ దీసి యద్దాని నొక్క
పెసరగింజను బరులకుఁ బెట్టరాదు. 44.

తే.గీ. దాసదాసీజనంబుల దయ దలిర్పఁ
బెట్టువోఁతలఁ దనుపుచు, వెలఁది వారి
గదివి చీటికిమాటికిఁ గసురుకోక
వారు ప్రేమింప వర్తింపవలయుఁ దాను. 45.

తే.గీ. మున్నె తనశక్తియు నశక్తి యెన్ని చూచి
యితరులకు నెప్పుడును మాట యియ్యవలయు;