పుట:Stree Neetideepika.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిచ్చెనేనియు, మణి యేది యెట్టులైనఁ
దీర్పవలె దాని ధర్మంబు తెగకయుండ. 46.
                             చౌర్యము

ఆ.వె. దొంగతనము చేయ దొర పట్టి శిక్షించు;
నిరుగుపొరుగువార లెగ్గు లెంత్రు;
పరమునందు నరకబాధలు పైకొను;
దోషములకుఁ గుదురు దొంగతనము. 47.

తే.గీ. ఎవరు పట్టుకోఁ గలరని యెంచుకొన్న,
దాఁగనేరదు చౌర్యంబు ధరణిలోన;
దాఁగెనేనియుఁ జానరో! దైవ మైనఁ
గాంచి శిక్షింపఁడే యట్టికట్టిడులను : 48.

తే.గీ. భామ లెప్పుడుఁ దృణ మైనఁ బరులసొమ్ము
వారియనుమతి లేకుండఁ జేరఁ బోయి,
ముట్టుకో రాదు; పొరపడి ముట్టుకొన్న,
శాశ్వతం బైన యపకీర్తి సంఘటిల్లు. 49.
                           అహింస

తే.గీ. కొమ్మ! యఱకాలునను ముల్లు గ్రుచ్చుకొన్న
నెంత నొప్పిగ నుండునో యొణిఁగి నీవు
జీవహింస యెన్నండును జేయఁ బోకు;
జంతువుల కన్నిఁటికి బాధ సమమె కాన. 50.

తే.గీ. దయను మించినధర్మంబు ధరణిలోన
వెదకి చూచిన నొక్కటి వేఱెలేదు;
కావునను దీని మది నుంచి కన్నెలార!
భూతదయ గల్గి మెలఁగుడు పుడమి విూఁద. 51.