పుట:Stree Neetideepika.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మితవ్యయము
తే.గీ. కష్టపడి భర్త యెందైనఁ గడన చేసి
యింట నుంచినవస్తువు లించుకైన
వ్యర్థముగఁ బోవుటకు నోర్వ కతివ యెపుడు
వాని మితముగా వ్యయపెట్టవలయుఁ జమ్ము. 35.

తే.గీ. అధికముగఁ దెమ్మటంచును ననుదినంబు
మగనిఁ బీడింప కనువున నిగురుబోఁడి
కలుగునంతటిలోపలఁ గడుపుకొనుచుఁ
దెలివి తేటలు గలిగి వర్తింపవలయు. 36.

తే.గీ. భాగ్యవంతులు ధరియించు వస్త్రములను
భూషణంబులఁ గనుఁగొని బుద్ధిహీన
లైననారులు నాథుల వానిఁ దమకుఁ
దెండటంచును బీడింత్రు దీనవృత్తి, 37.
సుగుణములు

తే.గీ. పువ్వులును, మంచిబట్టలు, భూషణములు,
సుగుణములయట్ల యెన్నఁడు సుందరులకు
శోభ తేనేర వది గాన సుదతులార!
సుగుణసంపద గడియింపఁ జూడుఁ డెపుడు. 38.

ఆ.వె. నీతి లేకయున్న, నిఖిలంబు చెడిపోవు,
నీతి గలుగుసతికి నిఖల ముండు,
నీధరిత్రిలోని దేది యెట్లైనను,
నీతి విడువరాదు నెలఁత యెపుడు. 39.

తే.గీ. తనకు దైవంబు దయచేయుదానితోనె
తృప్తిపొందిన సుఖపడుఁ దెఱవ యెపుడు,