పుట:Stree Neetideepika.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమబుధ్ధి

తే.గీ. ఎల్లరును నొక్కదైవంబెయిల సృజించెఁ;
గావునను, భేద మెంచక కలుకులార!
యక్క సెలియండ్ర వలెఁ జూడ నగును స్త్రీలఁ;
బురుషులను జూడ వలయు సోదరులమాడ్కి. 81.

తే.గీ. ఎదుటివారికి మర్యాద నెఱిఁగి చేసి
వారిచేఁ దాను మరియాద పడయ వలయుఁ;
బరులఁ దొలుతను గౌరవపరుప కున్నఁ,
దలకు గౌరవ మబ్బదు తధ్యముగను. 82.
                   బాలశిక్షణము

ఆ.వె. పిల్ల లొక్క వేళ నల్లరి చేసిన,
బుద్ధి చెప్పవలయు బుజ్జగించి;
నయము భయము చూపి న్యాయంబునకుఁ ద్రిప్పి
చెలువ తగినశిక్ష సేయ వలయు. 83.

తే.గీ. తెఱవ నోటికి రానట్టితిట్లు తిట్టి
గొడ్డు బాదిన కైవడిఁ గొట్టె నేనిఁ,
దా మృగప్రాయ యౌట యందఱకుఁ దెలుపుఁ
గాని బాలునకును బుద్ధి గఱప లేదు. 84.  
                   వివిధ ధర్మములు

ఆ.వె. ఎదుటివారు నీకు నేరీతిఁ జేయంగ
వలయు నంచు మదిని దలఁచు కొనెదొ,
యెదుటవారి కీవు నెప్పుడు నారీతిఁ
జేయు చుండవలయుఁ దోయజాక్షి! 85.

తే.గీ. కుడిచి కూర్చుండియేమిటఁ గొదవ లేక
వీరిని వారినిఁ జేరిచి యూరివారి