పుట:Stree Neetideepika.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యెన్నిపాటులు పడి యైన నెల్లవారు
శాంతతను దాల్చుయత్నంబు సలుప వలయు. 69.

తే.గీ. దాసదాసీజనంబులు తగవు మాలి
తప్పు చేసిన, దానినె తడవ కెపుడు
సైరణ వహిరించి యొక రెండుసారులైన
వారి మన్నింప వలయును వారిజాస్య! 70.
                              ధైర్యము

తే.గీ. ఆపదలు వచ్చినప్పుడు నలరుబోండ్లు
తాము ధైర్యంబు విడువక, తక్కుగలుగు;
వారి నూఱార్చి దుఃఖంబు వాప వలయు;
ధైర్యమున నాపద సగంబు తగ్గి పోవు. 71.

తే.గీ. వసుధ నెపుడైనను విపత్తు వచ్చినపుడు
తాల్మి విడనాడి వగ గూరి తలఁకు చున్న;
దొసఁగు రెట్టింపుగాఁగను దోఁచుఁ గాని
కొంచె మైనను గార్యంబు కూడిరాదు. 72. 
                              గర్వము

తే.గీ. చక్కఁదన మున్న, సంపద చాల నున్న
లేరు భువిలోన నాపాటివా రటంచు
విఱ్ఱవీగంగఁ దగ దెందు వెలఁదులకును ;
దాన నెంతయు నెగ్గగుఁ దప్పకుండ. 73.

తే.గీ. ఎంతయైశ్వర్య ముండునో యంతయడఁకు
వొనర మెలఁగంగ వలెఁ జుండు వనితలార!
సర్వసుగుణంబు లుండియుఁ జాల, నొక్క
యడఁకువమై లేనిచో వ్యర్థ మవియుఁ గూడ. 74.