పుట:Stree Neetideepika.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాయునట్లుగఁ దోముకో వలయు నొడలు,
రోగమును నొప్పి లేకుండ సాగుకొఱకు. 63.

తే.గీ. ఎపుడు స్నానంబు మానక యిందువదన
విలువవస్త్రంబె వలె నని వెఱ్ఱిపడక
ముతక దైనను గానిమ్మ ముఱికి లేని
వస్త్రమునె ధరించుకో వలయుఁ జుమ్ము. 64.

తే.గీ. కల్మషజలంబు త్రాగినఁ గలుగు వ్యాధి;
వాస్తవము దీని మది నుంచి వడియఁగట్టు
నిర్మలజలంబె త్రావుచు నెలఁత యెపుడు
తేర్చి తనవారి కీవలేఁ దేటనీరే. 65.

ఆ.వె. మితము తప్పి తినుట మేలుగా దెన్నఁడుఁ
తినియెనేని, గొప్ప తెవులు వచ్చు;
వల దనంగఁ గొంత వడ్డించుకొం డంచుఁ
బెఱలను బలవంత పెట్టరాదు. 66.

తే.గీ. మంచివాయువు లేదేని మనుజులకును
వ్యాధు లొదవును గావున వనజముఖులు
తలుపులన్నియు మూయక తగినగాలి
పడకయిలు సేరు పనిఁ జూడ వలయుఁ జుండు. 67.

తే.గీ. గాలి దుర్గంధసహితమై కదిసెనేనిఁ
గలికిరో! దేహమునకు రుగ్మతలు వచ్చు;
నింటిపజ్జను ముఱికినీ రెన్నఁటికిని
నిలువ నీయకు మమ్మయో నేలఁతమిన్న! 68. 
                              శాంతత్వము

తే.గీ. సర్వధర్మంబులకు నొక్క శాంతగుణమె
వన్నెఁ దెచ్చునలంకార మన్నులార!