పుట:Stree Neetideepika.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.గీ. లేమ! తిన్నఁగా మాటాడ లేనివారు
తెలివిలేమిని నినుఁ దప్పఁ బలికి రేనిఁ,
దప్పుగాఁ బట్టుకొని దానిఁ దడవుకొనుచుఁ
గోప పడకుము వారిపై గొదవలెన్ని. 58. 
పాటు

ఆ.వె. పాటు పడిన, నొడల బలము లెస్సగ నుండుఁ
బాటు పడిన, మేనివ్యాధి పోవుఁ ;
బాటు పడిన, సుఖము బాగుగఁ గలుగును ;
బాటు పడఁగ వలయు భామ లెందు. 59.

ఆ.వె. ఇంతద్రవ్య ముండఁ నిట్లు సాగుచు నుండఁ,
బరిజనంబు నింత బలిసి యుండఁ,
నడచి పనులు సేయ నా కేమి యనఁ బోక,
పడఁతి యెవుడుఁ గష్టపడఁగ వలయు. 60.

ఆ.వె. పనులు సేయునెడలఁ బడఁతుక యెప్పడు
దాసిపలెను దానె చేసికొనుచు,
ననుభవించుసమయమున రాణికైవడి
ననుభవింప వలయు, నడ్డులేక. 61.
                        శరీరారోగ్యము

తే.గీ. అన్నిధర్మంబులను ముఖ్యమైన దరయఁ
దసదుదేహంబు కాపాడుకొనుటె కాన,
లేనిపోనియాచారముల్ పూని, పొలఁతి!
యొడలు చెడఁగొట్టుకొన కెప్డు నుండ వలము. 62.

తే.గీ. ప్రాలుమాలక భామినుల్ ప్రతిదినంబు
స్నాన మొనరించుచును దనుమేనిముఱికి