పుట:Srivemanayogijiv00unknsher.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారోపించిన రీతిని యమాయికత్వసూచకములు మఱియును గొన్ని బంగాళీలో ఠకుర్‌జీయందు బెట్టినట్లు మహత్త్వమును చూపునవి. ఇట్లు పెక్కులు గలవు. వీనినన్నింటిని నమ్మినయెడల నిజమగుచరిత్ర జ్ఞానమునకు భంగముకలుగును. కావున సాధ్యమైనంతవఱకు అట్టివానిని విమర్శించి నిజములగు కథల నేఱ్పఱుచుట జీవిత లేఖకునకు ముఖ్యమగు కార్యము. అట్టిదానిని కూఱ్చుటకు గవికృతములగు గ్రంథములు ఆధారములగును. మన వేమన రచించిన యితరగ్రంథములు ఏవియును లేవు. కూడినవఱకు వేమన గ్రంథమునుండియే అట్టివానిని వెదుక వలయును. వేమన తన గ్రంథమును సుబోధకమును ఇంపుజనింపునదియు నగు శైలిలో వ్రాసెను. ఆవ్రాయుటలో నెన్నియో విషయములను దురవగాహములైన వానిని సులభముగా వాక్రుచ్చెను. నిజముగా పైనుదహరించిన భర్తృహరి తులసీదాసు మున్నగువారి యొక్క "నీతిశతకము, వినయపత్రిక" మొదలగు గ్రంథములు లోకమునకు వినయవిధేయతలను సత్యమతస్వరూపమును నీతిని బోధించుటకే పుట్టినవి. మన వేమనకవిగారి గ్రంథజననము గూడనందుల కే. దొఱకినంతలో వేమనపద్యములన్నిటిని విమర్శించి చూడపెక్కులు "తత్వమార్గమునకు" అనగా నిజమగు వేదాంతవస్తువును బోధించుటకు సంబంధించి