పుట:Srivemanayogijiv00unknsher.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవి గలవు. ఒకపర్యాయ మితరమతముల ననగా రామానుజాదిమతముల నిందలును గలవు. వీనిని బట్టి చూడ మన వేమన శైవుడని తేలును. శైవుడన్నంతమాత్రముచేత లింగధారణము ముద్రలునతనికి గిట్టవు. ఇట్టివానిని ఎక్కువగా నిందించి యున్నవాడు. వీనియన్నిటికంటెను పెక్కుచోట్ల నామములను వానిని ధరించినవారిని నిందించి యుండెను. వీటిని నన్నిటిని బట్టిచూచినను "మొత్తముమీద నీమహానుభావుడు చెప్పిన తత్త్వవిషయము త్రిమతములలో దేనికి సంబంధించియుండును" అని విమర్శించినను, శివభక్తిప్రధానముగా గలసాత్వికుడగు నద్వైతియని బోధపడును. 15 వ శతాబ్దపు చరిత్రములు గూడ నాకాలమున రామానుజమత ప్రాబల్యమును తదుపశమనమునకై శైవమత విజృంభణమును సూచించుచున్నవి. ఆపదునేనవశతాబ్దములో "వాడువీడనక" యందఱును అసత్యమతముల నవలంబించి చెడిపోవు చుండుటచేత వేమన భర్తృహరి మొదలగు వారివలెనే నయమున భయమున ప్రజలకు నీతిని మతమును నేర్పుటకై అతిసులభశైలిలో నీపద్యములను రచించి వెలయించెనని తేలుచున్నది. సత్యాన్వేషణబుద్ధితో విమర్శించిన బుద్ధిమంతు లీవిషయముల నొప్పికొనకపోరు.

అయినను లోకములోని కథలలో వేమన్నగారికి