పుట:Srivemanayogijiv00unknsher.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరు గలవా రుండిరి. ఇఱువురును కోమటివెంకారెడ్డి వంశీయులే అయినను అద్దంకినేలిన వేమభూపాలుడు వేమనయోగికంటె భిన్నుడు. అద్దంకివేమన చరితమునే అబినవబాణు డనువాడు. "వేమభూపాలచరిత మ"ను పేరున సంస్కృతమున గద్య కావ్యముగా రచించెను. అందద్దంకిరాజులవంశవర్ణనగలదు, దానిలో మన వేమనకవినిగాని ఈయన జీవితమును గూర్చినసూచననుగాని తుదకుశతకపు ప్రస్తావనగాని సూచించి యుండలేదు. అందువలన మన వేమన అద్దంకివేమన కాజాలడు. కొండవీడులో నున్న వేమనయే కావచ్చును. శతకములో కొన్నిపద్యముల భాషావైఖరిని బట్టిచూడగా ఈ యంశము దృడమనియే తేలుచున్నది కొండవీటి రెడ్లు పదునైదవశతాబ్దపువారని యనేక శాసనములయు చరిత్రాకారులయు అభిప్రాయమై యున్నది. కావున మన వేమనకవియును కొండివీటిరెడ్లవంశమున జనించినవాడును, పదునైదవశతాబ్దమువాడే యగును.

వేమన గ్రంథమును చేయుటకు కారణము

వేమన గ్రంథమును చేయుటకు అనేకుల నేకములను కారణములనుగా చెప్పెదరు. అందు గొన్ని పిట్టకథలు, మఱికొన్ని సంస్కృతభాషలో కాళిదాసుపైనను భర్తృహరిపైనను గలిగినట్టి రంకుబొంకు కథలు, ఇకగొన్ని హిందీభాషలో తులసీదాసుని