పుట:Srivemanayogijiv00unknsher.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు?" అని యడిగెను. వేమన్న వినయసంభ్రమములు ముప్పిరిగొనగ చిత్తము స్వామీ! దాసుడను. అభిరామయ్యగారి శిష్యుడను. వారు తమ యాజ్ఞ ప్రకారము రానెంచియుండగా "ప్రభువుల వసరమని చెప్పి యొకపనిని యొప్పగించిరి. కావున వారు రాలేక తమకు పూజాసమయము అతిక్రమించునో యేమొ యని నన్నుబిలచి పూవులు సమర్పింప బంచిన, వచ్చినవాడను" అని పలికి నమ్రుండై నిలువబడి యుండెను.

యోగి యామాటలను విని "మంచిది పూల నచ్చటనుంచి" వాడు వచ్చుచున్నాడేమొ! కనుగొను మనిపలికి కనులుమూసికొనెను. కపటియగు మన వేమన్నయును ఇటునటు జూచి యచ్చటనే నిలువబడి యుండెను. మఱలకొంతసేపు అయినతఱువాత కనులువిప్పి యోగి "ఏమిరా! యిచ్చటనే యుంటివా? వచ్చుచుండెనేమొ చూడు మని యంటినే చూచితివా? చూడు మనిపలికెను. మఱల వేమన్నయును క్రిందటిపర్యాయము వలెనే పది పండ్రెండడుగులు గుహదాటి వచ్చి రెండుమూడు నిమేషములు పరికించిన వానివలె యాలస్యముచేసి మరల గుహలోనికి పోయి "స్వామీ! వారింకను రాలేదు. చూడగా వారు వచ్చునను జాడయైనను కనుపట్టుట" లేదని విన్నవించి చేతులు కట్టికొని నిలు