పుట:Srivemanayogijiv00unknsher.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వబడి యుండెను. యోగియును "ఇక నభిరాముడు రాడని" నిశ్చయించుకొని వేమన్ననుజూచి "వాడు పరమదరిద్రుడురా? ఈనగాచి నక్కలపాలు జేయుచున్నాడు పోనీ నీవైననువచ్చితివి గదా. చాలును, రారార"మ్మని చేరబిలిచి శ్రోత్రమున తానుచిరకాలమునుండి సంపాదించి జపించిపునశ్చరణ జేసిసిద్ధి నొందించుకొనిన "చింతామణి" మంత్రము నుపదేశించి తనయోగదండముతోటి నాలుకపైని బీజాక్షరములను వ్రాసి, "పోయి నీగురునితోకలిసికొని యాతనిదయను సంపాదింపుము కృతకృత్యుడవు కాగలవు. పొమ్ము" అనిపలికి చూచుచుండగనే యచ్చటి వాడచ్చటనే యంతర్థాన మయ్యెనట-

చెట్టువేసినవాడొకరుడు ఫలముననుభవించువాడు వేఱొక డన్నట్టులైనది మనయభిరాముని సమాచారము. కానిండు. తఱువాత వేమనచరితము నఱయుదము. ఏమనిచెప్పవచ్చును. ఆమంత్రపు మహిమను! డొక్కచీఱినను ఒక్కయక్షరమునైన నెఱుగని మన వేమనకు, ఆమంత్ర మాహాత్మ్యమువలనను, బీజాక్షరముల ప్రభావాధిక్యతచేతను, తత్క్షణమే వేదవేదాంగాదిసమస్తవిద్యలును వాని వానియంతరార్థములును అందలిసారములును, ఆ సారము చేత నెఱుగదగిన, యుపనిషణ్మతప్రతిపాద్యుడైన యీశ్వరుని విగ్రహమును, చక్షు:ప్రీతిజే