పుట:Srivemanayogijiv00unknsher.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని విచారమునొంది ఎట్లైననుకాని "బ్రదికియుండిన శుభములు పడయవచ్చు" ననురీతిని మతినిసమాధానము చేసికొని మఱునాడు రాజభవనమున కుందనపు పనిచేయ బోవుటకే నిశ్చయించికొని భోజనము చేసిపరుండెను కాని నిద్దుర యెట్లుపట్టగలదు. ఎన్నిరోజులనుండియో చేసినకృషి, నిండిన చెరువునకు కట్టతెగ గొట్టినట్లుగా నొక్కదినములో పల వ్యర్థమైపోవును కదా యనుచింత, "కనులు మూసికొని నిద్రింపవలయు" నని యనుకొను నాతని నుఱ్ఱట్టులూపుచు ఎన్నిటినో పెక్కులను చిక్కులను బెట్టి కలవరము నొందించుచుండెను.

వేమన్నయును మఱుదినము పెందలకడనే లేచి యభిరామయ్య బోయిన త్రోవచొప్పుననే పోయి యాకొలనిలోనే స్నానము నాచరించి కొని పూవులతోటలోని పూవులను కోసికొని పర్వతపుగుహలో బ్రవేశించి శివయోగిసన్నధిని చేరి అభిరామయ్యకంటె నయిదారుమడుగు లెక్కువబత్తి గనబఱచుచు పూలచెంబుదోసలిలో నుంచికొని యోగియొక్క దయార్ద్రకటాక్షవీక్షణమునకై వేచియుండెను. యోగియును కొంతసేపటికి కనుల విప్పిచూచి ప్రతినిత్యమునువచ్చెడు పురుషుడుగాక నేడు క్రొత్త విగ్రహమునిలచియుండుట గనుగొని "ఎవరురా