పుట:Srivemanayogijiv00unknsher.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యభిరామయ్యయే మే"లని పల్కెనట. వేమన్న చెప్పినప్రకారము అభిరామయ్య రాక యెప్పటి యట్టులె యాలస్యము చేయుచుండెను. దీనిని చూచి వేమన్న ఇన్నిమారులు చెప్పినను ఇతడు మాటనులక్ష్యము పెట్టినవాడుకాడు. మనమిచ్చు ధనముకంటె గూడ నమూల్యమైన వస్తువు నితను సంపాదింప బూనెను కాబోలు నేమొ! అయినను ఎంతనిష్ఠగలవాని కైన నింతయాలస్యమా ? రేపు దీనినెట్లయినను కనుగొనవలయు నని నిశ్చయించికొనెను?

మఱునాడు వేమన రెండుమూడు గడియల రాత్రి యుండగనే లేచి యభిరామయ్య విషయమును సంపూర్ణముగా గని పెట్టుటకై యతనియింటి యొద్ద చేరి ఆసమీపమున నున్న చెట్టుపై గూర్చుండి యుండెను. కనికనచీకటి యుండగా నభిరామయ్య నిద్దుర లేచి చెంబుచేత బట్టుకొని వీరభద్ర విజయము మున్నగు స్తోత్రపాఠములను చదివికొనుచు కాల కృత్యముల నిర్వర్తించుకొనుట కూఱికి బయల నున్న కొలను జేరి పాదప్రక్షాళనమును ముఖశుద్ధినిచేసి స్నానము జేసికొని బట్టల నుదికి యారవైచికొని ఆబట్టలను గట్టికొని చేరువనున్న పూవులతోటలోని కేగి చేతిచెంబునిండ పూవులను కోసికొని కొండ కభిముఖుడై పోయెను.

ఇట్లు పోయిపోయి యచ్చటగుహలో గూర్చుని