పుట:Srinadhakavi-Jeevithamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

శ్రీ నా థ కవి


నిత్యం నందివర్వైః రభివవైః కాంతై స్వయంతోత్సవైః
సంతానాభ్యుడయై కుమా: గిరి భూపాలో సృపాలోత్తమం


ఈవసంతభూపాలుని కొల్వుకూటమున లకుమా దేవి యను నొక వేళ్యాంగన సహస్రధా నాట్యాభినయంబుల నెఱపుచు నృత్యము లు సలుపుచు వేలకొలది యర్థిజనంబులకు ధన మొసంగుచుండెని ధని యీ క్రిందిశ్లోకము వలన విదిత మగుచున్నది.


శ్లో, జయతి మహిమాలోకాతీతః కుమారగి ప్రభో
స్పదనీల కుమా దేవీ యస్యప్రియా సదృశీప్రియా
నవమభినయం నాట్యర్ధానాంమోతి సహస్ర ధా
వితరతి బహూనర్దానర్థి ప్రజాయ సహస్రశః

అవచి తిప్పయ సెట్టి

ఆకాలమున వసంతోత్సవములు సలుపు నాంధ్రరాజులలో రెడ్డి రాజులు ముఖ్యులుగవాసి కెక్కియుండిరి. వారిలో కుమారగిరి రెడ్డి విస్తరించి సలుపుటచే నాతనికి వసంత రాజనుబిరుదమును స్థిరమై పోయింది. ఇక్కాలమున వీరమహేశ్వరాచార భ క్తిపరుఁ డే శివసా యుజ్యముఁ బొందివ కంచిచిఱుతొండ నంబివంశమున జనించిన యకచి దేవ సెట్టి కుమారుఁడు తిప్పయ పెట్టి కోటీశ్వరుఁడు కుమారగిరి రెడ్డికి మిత్రుడును, సచివుఁడును సుగంధ భాండాగారాధ్యక్షుడు నై యీప్ర ఖ్యాతవసంత రాయడు సలుపు ప్రతి సంవత్సర వసంతోత్సవములకు కస్తూరీకుంకుమ ఘనసార సంకుమదహిమాంబు కాలాగురుగంధ సారప్రభృతి సుగంధ ద్రవ్యంబు లొడఁగూర్చుచు నెక్కువగా దోడ్పడుచుఁ బ్రఖ్యా తిఁ గాంచినవాఁడు. ఇంతియగాక మఱియు నీతఁడు చీనిసింహళతవాయి హురుమంజిజలనోగి ప్రభృతినా నాద్వీపనగరాకరంబు లగు ధనకనకవస్తు వాహనమాణిక్య గాణిక్యంబులు తెప్పించుచు కొండవీటి సామ్రాజ్యధి పతియగు కుమారగిరిభూపాలునకు మాత్రమెగాక విజయనగర సామా జ్యూధిపతియగు రెండవ హరిహర రాయలకుమ్ము ' భూమనీషుల్తానగు